భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి పెండింగ్ క్లెయిమ్‌లు వెంటనే మంజూరు చేయాలి 50 ఏళ్లు నిండిన కార్మికులకు రూ.05 వేల పెన్షన్‌ ఇవ్వాలి ఏఐటీయూసీ బిల్డింగ్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 13 : భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఏఐటీయూసీ అనుబంధ టీఎస్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు పట్టణంలో కార్మికులు భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం కార్మికుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ (ఏసీఎల్)...