ఖండిత కందకాల పనులను పరిశీలించిన ఎంపీడీఓ రామకృష్ణ

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 13 : కోరుట్ల మండలం సర్పరాజ్ పల్లి గ్రామంలో వీబీజీ రామ్‌జీ పథకం కింద చేపడుతున్న ఖండిత కందకాల పనులను ఎంపీడీఓ వోదెల రామకృష్ణ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత లక్ష్యాల ప్రకారం పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేసి, భూగర్భ జలాల పెంపునకు ఖండిత కందకాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామంలో ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచడంతో పాటు నీటి సంరక్షణ పనులను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నత్తి రాజ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి శ్యామల పాల్గొన్నారు.