గడి బురుజుల స్థలంపై విధించిన వీఎల్టీని తక్షణమే రద్దు చేయాలి
గడి బురుజుల స్థలంపై విధించిన వీఎల్టీని తక్షణమే రద్దు చేయాలి మున్సిపల్ చైర్మన్, కమిషనర్లకు వినతి పత్రం అందజేసిన కోరుట్ల ఎమ్మెల్యే తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 13 : కోరుట్ల పట్టణంలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన గడి బురుజుల స్థలంపై మున్సిపాలిటీ విధించిన వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (వీఎల్టీ)ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లతో కలిసి, మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్, మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్రలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. గడి బురుజుల స్థలం పట్టణానికి సంబంధించిన విలువైన ప్రజా ఆస్తి...