ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు కీలకం

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు కీలకం మండల విద్యాధికారి మోహన్ రెడ్డి బుగ్గారం, నవంబర్ 13: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఎంతో కీలకమైనవని మండల విద్యాధికారి మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బుగ్గారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛమైన ఓటర్ల జాబితా అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించగా, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి పోటీల ద్వారా విద్యార్థులకు ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు ప్రాముఖ్యత, ఎన్నికల వ్యవస్థపై అవగాహన పెంపొందుతుందని తెలిపారు. భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ఈ పోటీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. మండల స్థాయిలో...