కాలనీవాసుల ఫిర్యాదుతో స్పందించిన హైడ్రా.. ప్రశాంత్ నగర్లో 2,121 గజాల స్థలాలకు రక్షణ
కాలనీవాసుల ఫిర్యాదుతో స్పందించిన హైడ్రా.. ప్రశాంత్ నగర్లో 2,121 గజాల స్థలాలకు రక్షణ పాఠశాల, పార్కు, కమ్యూనిటీ హాల్ స్థలాల పరిరక్షణ.. హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపిన కాలనీవాసులు (తెలంగాణ కెరటం) ఘట్కేసర్ ప్రతినిధి / నవంబర్ 13: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, ఘట్కేసర్ సర్కిల్, పోచారం అన్నోజిగూడ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీలో ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించిన స్థలాల ఆక్రమణల విషయంపై కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేయగా అధికారులు స్పందించి ఆయా స్థలాలకు రక్షణ కల్పించారు. గ్రామ పంచాయతీ ఆమోదించిన లేఅవుట్లోని సర్వే నంబర్లు 94, 95లో పాఠశాల, పార్కు, కమ్యూనిటీ హాల్ నిర్మాణాల కోసం కేటాయించిన మొత్తం 2,121 గజాల స్థలాన్ని హైడ్రా...