పేదలకు ఇళ్ల స్థలాలు కల్పించాలి.. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగే వరకు పోరాటం
పేదలకు ఇళ్ల స్థలాలు కల్పించాలి.. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగే వరకు పోరాటం నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలి.. తెలంగాణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కమిటీ డిమాండ్ (తెలంగాణ కెరటం) మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, నవంబర్ 13: జిల్లాలోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కల్పించి, వారి సొంతింటి కలను నెరవేర్చాలని ప్రధాన డిమాండ్‌తో తెలంగాణ పౌర సంక్షేమ సంఘం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కమిటీ సమావేశం నిర్వహించింది. ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని సమావేశంలో నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర నాయకులు తీగల వెంకటేష్, తూటి రాంచందర్, ఎన్.ఎన్. రావు...