యువత మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి సారించాలి.
యువత మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి సారించాలి. ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 13) నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని బుడ్డతాండ గ్రామ యువతను క్రీడల్లో ప్రోత్సహించడంతో పాటు వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే ఉద్దేశంతో అచ్చంపేట శాసనసభ్యులు డా. చిక్కుడు వంశీకృష్ణ క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత మద్యం, మాదకద్రవ్యాలు మరియు ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, తమ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతిరోజూ క్రీడా మైదానంలో ఆటలు ఆడాలని సూచించారు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వం, క్రమశిక్షణ,...