విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన.
విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన. ఉచిత వైద్య శిబిరం నిర్వహణ. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 13): నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణ, అటవీ పరిరక్షణ మరియు పర్యావరణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా వైల్డ్‌లైఫ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అడవుల ప్రాముఖ్యత, వన్యప్రాణుల జీవన విధానం, జీవవైవిధ్య పరిరక్షణ, వన్యప్రాణుల ఆవాసాల సంరక్షణ, మానవ–వన్యప్రాణుల మధ్య సంఘర్షణ నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. వన్యప్రాణులను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రకృతిలో ప్రతి జీవికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని వివరించారు. చిన్న...