సింగరేణి మండలంలో గోదావరి జలాల తరలింపుపై బీజేపీ ఆందోళన.. స్థానిక చెరువులకు నీటిని విడుదల చేయాలని తహసీల్దార్ వినతి పత్రం
సింగరేణి మండలంలో గోదావరి జలాల తరలింపుపై బీజేపీ ఆందోళన.. స్థానిక చెరువులకు నీటిని విడుదల చేయాలని తహసీల్దార్ వినతి పత్రం సింగరేణి, (13/11/2026: గురువారం):మండలంలో గోదావరి జలాల తరలింపుపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రూపొందించిన మ్యాప్‌ను ప్రస్తుత ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. సింగరేణి మండలం నుంచి అశ్వారాపేట మండలం, ఆంధ్రా బోర్డు మరియు పాలేరు ప్రాంతాలకు వెళ్లాల్సిన నీటిని అక్రమంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. ఇది ఏజెన్సీ ప్రాంతం కావడంతో రైతులు తీవ్ర నీటి ఎద్దడితో సతమతమవుతున్నారని...