అచ్చంపేట నియోజకవర్గాన్ని కరువు నుంచి కాపాడండి
కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 14): నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం తీవ్ర కరువులో కొట్టుమిట్టాడుతోందని, కరువులో ఉన్న రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఐ అచ్చంపేట నియోజకవర్గ ఇంచార్జి పి.గోపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 16న తలపెట్టిన నాగర్ కర్నూల్ చలో - కలెక్టర్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూనాగర్కర్నూల్ జిల్లాలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గం అచ్చంపేట అని, ఇక్కడి ప్రజలు తాగునీరు, సాగునీరు లేక, ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం...