కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం.
కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 14): భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు వేముల నరేందర్ రావు ఆధ్వర్యంలో శనివారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామ్ చందర్ రావు పిలుపు మేరకు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వేముల నరేందర్ రావు గారు మాట్లాడుతూదేశవ్యాప్తంగా ఈవీఎంల ద్వారా జరుగుతున్న ఎన్నికల నిర్వహణపై, ఎన్నికల సంఘంపై నిరాధార ఆరోపణలు చేస్తూ రాజ్యాంగబద్ధ సంస్థలను అపహాస్యం చేస్తున్న రాహుల్...