పోతారంలో ఘనంగా బాలల గ్రామసభ

మనోహరాబాద్ తెలంగాణ కెరటం:-బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పోతారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాలల గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పుట్ట వినోద మహేందర్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, బాలల చిరునవ్వులోనే దేశ భవిష్యత్తు దాగి ఉందని అన్నారు.బాలల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మంద యాదగిరి,మన్నె సురేష్,చెలిమెల పవన్ గౌడ్,సంకి శ్రీకాంత్,పంచాయతీ కార్యదర్శి రజిత,ఉపాధ్యాయురాలు షర్మిల,అంగన్‌వాడీ టీచర్ తులసి, ఆశా వర్కర్ రత్న,గ్రామస్తులు,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.