చలి తీవ్రత పెరుగుతోంది.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. –దుబ్బాక వంద పడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్

దుబ్బాకప్రతినిధి, నవంబర్ 14, తెలంగాణ కెరటం:రోజురోజుకూ పెరుగుతున్న చలి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని దుబ్బాక ప్రభుత్వ వంద పడకల ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్" హేమరాజ్ సింగ్ సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను వణికిస్తోంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల వ్యాప్తంగా ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. చెట్లు, గుట్టలు మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా కనిపిస్తూ ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నప్పటికీ, చలి తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా గ్రామాల్లో ఉదయం వేళ వీధి...