​కన్నతల్లిపై హత్యాయత్నం చేసిన కుమారుడి అరెస్ట్

ముఖ్యమైన పాయింట్స్:​కన్నతల్లిపై హత్యాయత్నం చేసిన కుమారుడి అరెస్ట్ తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు.....మంచిర్యాల...​మందమర్రి పట్టణంలోని విద్యానగర్‌లో ఇల్లు ఖాళీ చేయించే విషయంలో తలెత్తిన వివాదంతో కన్నతల్లిపై రోకలి కర్రతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని మందమర్రి పోలీసులు అరెస్ట్ చేశారు.  ​కేసు వివరాలు:మందమర్రి విద్యానగర్‌కు చెందిన గాదె సారక్క (65) చెన్నూరులో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆమె కుమారుడైన గాదె రాజమల్లు (46) విద్యానగర్‌లోని వారి సొంత ఇంటిలో ఉంటున్నాడు. కొద్ది రోజులుగా ఇల్లు ఖాళీ చేయాలని తల్లి సారక్క కోరుతుండటంతో తల్లీకొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత నెలలో బంధువులు మరియు పెద్దమనుషుల సమక్షంలో జరిగిన పంచాయితీ...