చేయూత పింఛన్లతో పేదలకు ఆత్మగౌరవ జీవితం

సీఎం రేవంత్ రెడ్డి పాలనలో సంక్షేమ రాజ్యంమంచుకొండలో చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీలో మంత్రి తుమ్మల ఖమ్మం, నవంబర్ 14 (తెలంగాణ కెరటం): పేదలు తమ పిల్లలు, కోడళ్లపై ఆధారపడకుండా ఆత్మగౌరవంతో జీవించాలనే గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేయూత పింఛన్లను అందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. రఘునాథపాలెం మండలం మంచుకొండలో నిర్వహించిన చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఆత్మగౌరవంతో...