మల్లెమడుగు పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం

ఖమ్మం, నవంబర్ 14 (తెలంగాణ కెరటం):  పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లెమడుగులో  శనివారం బాలల దినోత్సవ వేడుకను  ఘనంగా నిర్వహించారు.  పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.సాంబమూర్తి సమక్షంలో  విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి, పాఠాలు బోధించారు. వి.పల్లవి జిల్లా విద్యాశాఖ అధికారిగా  వ్యవహరించింది. దేశ మొట్టమొదటి  జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నెహ్రూ చిచ్చపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పీడీ కృష్ణయ్య , అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు అలివేణి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.