గిరిజన సమస్యల సాధనకే.. సేవాలాల్ సేన ‘తండా బాట’

తొలి విజయం ప్రత్యేక ఎస్టీ కమిషన్గిరిజన లంబాడీల అభివృద్ధి, అభ్యున్నతి ధ్యేయం ‘సేన’ రాష్ట్ర అధ్యక్షుడు బాణోత్ హుస్సేన్ నాయక్ఖమ్మం, (తెలంగాణ కెరటం): దేశానికి స్వాతంత్రం సిద్దించి 80 వసంతాలు కావస్తున్న గిరిజన లంబాడీల మౌళిక సమస్యలు సమస్యలు పరిష్కారం కానీ నేపథ్యంలో సేవా లాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బాణోత్ హుస్సేన్ నాయక్ తన కమిటీ సభ్యులతో గిరిజన లంబాడీల సమస్యల సాధనకు నడుం బిగించి, ‘తండా బాట’ పట్టారు. ఈ సంవత్సరం అక్టోబర్ 28వ తేదిన భద్రాద్రి - కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం నుంచి ఈ తండా బాట (ప్రతీ తండాలో నిద్రించడం) కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్...