కత్తి మీద సాముల మారిన పత్రిక వ్యవస్థ
( నేడు జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా...)కత్తి మీద సాముల మారిన పత్రిక వ్యవస్థ✔--- ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ యం డి. షఫీ యు జమ ఖమ్మం, నవంబర్ 15 (తెలంగాణ కెరటం) : ప్రతి ప్రజాస్వామిక సౌధానికి నాలుగవ స్తంభంగా అభివర్ణించబడుతున్న పత్రికా వ్యవస్థ.... నేడు కత్తిమీద సాముల మారింది. మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీన జాతీయ పత్రిక దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. దేశంలో 1966 నవంబర్ 16 వ తేదీన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటయింది. దీనిని పురస్కరించుకొని అదే రోజు జాతీయ పత్రిక దినోత్సవం జరుపుకుంటున్నాము. ఒకప్పుడు వార్తల మధ్యలో ప్రకటనలు వచ్చేవి , నేడు...