సామాజిక న్యాయం కోసం ఎమ్మెల్సీగా నలువాల శ్రీకాంత్ గౌడ్‌ను గెలిపించాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ రక్షణ సేన నాయకుల విజ్ఞప్తి ములుగు జిల్లా బ్యూరో, (తెలంగాణ కెరటం) నవంబర్ 15: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన లక్ష్యాలు నెరవేరాలంటే సామాజిక న్యాయం సాధించడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని,అందుకోసం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆశీస్సులతో బరిలో నిలిచిన డాక్టర్ నలువాల శ్రీకాంత్ గౌడ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో ఆదివారం తెలంగాణ రక్షణ సేన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల మీడియా సమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు...