భగవాన్ బిర్సా ముండా పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శం-బాడిశ నాగ రమేష్
రాజుపేట లో బిర్సా ముండా జయంతి వేడుకలు. ములుగు జిల్లా బ్యూరో, (తెలంగాణ కెరటం) నవంబర్ 15:మంగపేట మండలం రాజుపేట లో భగవాన్ బిర్సా ముండా 151 వ జయంతి వేడుకలు అదివారం ఆదివాసి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ రామ కృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్,ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి బాడిశ నాగ రమేష్ హాజరై భగవాన్ బిర్సా ముండా చిత్ర పటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆదివాసి నాయకులు బిర్సా ముండా చిత్రపటం వద్ద పూలు కొబ్బరికాయలు సమర్పించి బిర్సా ముండా కీర్తి ని ఆకాశానికి చాటేలా నినాదాలు చేశారు....