సివిల్ ఎస్సైగా పదోన్నతి పొందిన పగిడిపెళ్లి ఓం ప్రకాష్ కు ఘన సన్మానం
ములుగు జిల్లా బ్యూరో, (తెలంగాణ కెరటం) నవంబర్ 15:మంగపేట మండలం బిక్షంపేట గ్రామానికి చెందిన మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన పగిడిపెళ్లి వెంకటేశ్వర్లు కుమారుడు పగిడిపెళ్లి ఓం ప్రకాష్ పోలీస్ శాఖలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇటీవల సివిల్ సబ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందడం అభినందనీయమని జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ యూత్ ప్రతినిధులు అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగాకొత్తగూడెంలో ఏఆర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ, తన క్రమశిక్షణ, అంకితభావంతో ఇటీవల సివిల్ ఎస్ఐగా పదోన్నతి పొందిన ఓం ప్రకాష్ కు మంగపేటలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు.త్వరలో భూపాలపల్లి ప్రాంతంలో సివిల్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించనున్న ఆయన మరిన్ని...