అయ్యప్ప ఆలయ అధ్యక్షుడిగా మరోసారి అంబటి శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 15 : కోరుట్ల పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ అధ్యక్షుడిగా అంబటి శ్రీనివాస్ గురుస్వామిని మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో ఆయన అందిస్తున్న సేవలు, భక్తులకు అందుబాటులో ఉంటూ ఆలయ కార్యక్రమాలను సమన్వయం చేస్తున్న తీరు పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ, శాశ్వత సభ్యులు ఆయనకు తిరిగి అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. కోరుట్ల పట్టణ అయ్యప్ప ఆలయ వ్యవస్థాపక శాశ్వత గౌరవ అధ్యక్షులు చిద్రాల నారాయణ గురుస్వామి అధ్యక్షతన ఆదివారం ఆలయ శాశ్వత సభ్యుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ నిర్వహణ, భవిష్యత్తు అభివృద్ధి కార్యక్రమాలు, స్వామివారి...