ఆర్‌ఎస్ ప్రవీణ్ కు కవితమ్మను విమర్శించే అర్హత లేదు

కోరుట్ల నియోజకవర్గ టిఆర్ఎస్ నేతల ఫైర్..తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 15 : టిఆర్ఎస్ చీఫ్ కవితమ్మను విమర్శించే అర్హత ఆర్‌ఎస్ ప్రవీణ్ కు లేదని, అంతకుముందు ఆర్‌ఎస్ ప్రవీణ్ తన గతాన్ని గుర్తు చేసుకోవాలని కోరుట్ల నియోజకవర్గ టిఆర్ఎస్ నాయకులు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం వారు మాట్లాడుతూ..టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవితమ్మ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అవినీతి, అక్రమ ధనార్జన అవినీతిపై ప్రశ్నిస్తే, ఆమెపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. అవినీతిని ప్రశ్నించే వారిపై విమర్శలు మానుకోవాలని, చేతనైతే అవినీతిని బయట పెట్టాలని ఆర్‌ఎస్ ప్రవీణ్ ను హెచ్చరించారు. గత రాజకీయ వ్యవహారాలపై సమాధానం చెప్పాలని వారు...