తెలంగాణ జాగృతి జిల్లా కమిటీ ఏర్పాటు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ తెలంగాణ జాగృతి జగిత్యాల జిల్లా అధ్యక్షులు పట్టూరి తిరుపతి సమక్షంలో జిల్లా కమిటీ, కోరుట్ల, వేములవాడ, జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జిలు, మెట్పల్లి, కోరుట్ల, మేడిపల్లి, జగిత్యాల, కొడిమ్యాల మండల కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పట్టూరి తిరుపతి మాట్లాడుతూ.. రాబోయే బతుకమ్మ పండగను ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు వేసి, 20 మంది పాటల కమిటీ, 20 మంది కోలాటం కమిటీల ద్వారా మండల కేంద్రాలలో ఆడుతూ, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు బతుకమ్మ పండగను జరుపుకొని, గిన్నిస్ రికార్డు చేరుకునేలా కమిటీ నాయకులు అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. జాగృతి స్వచ్ఛంద సంస్థ...