ఘట్‌కేసర్‌లో అంబేద్కర్‌కు ఘన నివాళులు

 292వ వారపు నిత్య పూలమాల కార్యక్రమంలో పాల్గొన్న యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ కుమార్ (తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 15: ఘట్‌కేసర్ పట్టణంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నిర్వహించిన 292వ వారపు నిత్య పూలమాల కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. సంస్థ ప్రతినిధి ఎం. అరుణ్ కుమార్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా ఘట్‌కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి, సామాజిక సమానత్వం, ప్రతి ఒక్కరికీ...