శ్రీ ఆంజనేయ, అయ్యప్ప స్వామి దేవాలయంలో అంజని మాత సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా గోపూజ.
కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 15):నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని శ్రీ ఆంజనేయ, అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆదివారం అంజని మాత సేవా సమితి ఆధ్వర్యంలో గోమాత పూజ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గోమాతకు పసుపు, కుంకుమ, పూలమాలలతో అలంకరించి, ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. గోమాతకు పండ్లు, బెల్లం, గడ్డి తినిపించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.గోమాత అంటే సాక్షాత్తు కోటి దేవతల స్వరూపమని, గోసేవ చేస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుందని, గోమాతను రక్షించడం ప్రతి హిందువు ధర్మమని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో అంజని మాత సేవా సమితి సభ్యులు, మహిళా భక్తులు, స్థానిక భక్తులు పెద్ద...