సగరుల హక్కుల సాధనకై రేపు కలెక్టరేట్ ముట్టడి
నిరసన కార్యక్రమానికి భారీగా తరలిరావాలి: రవి సాగర్ కౌడిపల్లి తెలంగాణ కెరటం నవంబర్ 15 సగరుల హక్కుల సాధన కోసం మెదక్ జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం, కలెక్టరేట్ ముట్టడి నిర్వహించనున్నట్లు సగర సంఘం రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రవి సాగర్ తెలిపారు. సగరుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు.సగర సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలు, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ల పరిష్కారం కోసం సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తమ...