అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం -నియోజకవర్గం వ్యాప్తంగా కొత్తగా 1924 మంది నూతన లబ్ధిదారులు పెన్షన్ల పత్రాలు మంజూరు.. -నవంబర్ 19 నుంచి ఇందిరా కుటుంబ బీమా పథకం ప్రారంభం -దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 16,(తెలంగాణ కెరటం)అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు, కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.సోమవారం అక్బర్ పేట భూంపల్లి మండలం రామేలింగేశ్వర ఫంక్షన్ హాల్ నిర్వహించిన చేయూత నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తో కలిసి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గం...