మల్యాల: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం వృద్ధుడు మృతి

 జిల్లా మల్యాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.మండలంలోని మద్దుట్ల గ్రామానికి చెందిన చుంచుల నడిపి మల్లయ్య రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తుతెలియని కారు బలంగా ఢీకొట్టింది.ఈ ఘటన మల్యాల x రోడ్ సమీపంలోని కరీంనగర్  జగిత్యాల ప్రధాన రహదారిపై జరిగింది.తీవ్ర గాయాలపాలైన మల్లయ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.