ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును బాధ్యతగా పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవ రావు ములుగు జిల్లా బ్యూరో, (తెలంగాణ కెరటం)నవంబర్ 16: ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును అధికారులు బాధ్యతతో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవ రావు ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుండి నేరుగా దరఖాస్తులను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను అడిగి తెలుసుకొని,వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ప్రజావాణి కార్యక్రమంలో భూ సమస్యలు 7, ఇందిరమ్మ ఇండ్లు 2, పింఛన్లు 4,ఇతరశాఖలకు సంబంధించినవి 9 కలిపి మొత్తం 22 దరఖాస్తులు అందాయి.ఈ సందర్భంగా...