ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంలో పత్రికా రంగం ముందుండాలి
ప్రశ్నించే గొంతుకగా.. ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభంగా జర్నలిజంవిలువలతో వాస్తవాలతో కూడిన విశ్లేషణే జర్నలిజం లక్ష్యంటియుడబ్ల్యుజే(ఐజేయు)జిల్లా కమిటీ సభ్యుడు ఎనగందుల శంకర్. ములుగు జిల్లా బ్యూరో,(తెలంగాణ కెరటం) నవంబర్ 16:ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంలో పత్రికా రంగం ముందుండాలని,ప్రశ్నించే గొంతుకగా.. ప్రజా స్వామ్యానికి నాలుగవ స్తంభంగా జర్నలిజం ఉందని,విలువలతో, వాస్తవాలతో కూడిన విశ్లేషణే జర్నలిజం లక్ష్యమని టియుడబ్ల్యుజే (ఐజేయు) ములుగు జిల్లా కమిటీ సభ్యుడు ఎనగందుల శంకర్ అన్నారు.జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో టియుడబ్ల్యుజే(ఐజేయు)జిల్లా కమిటీ సభ్యుడు ఎనగందుల శంకర్ మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో పత్రికా రంగం కేవలం సమాచారాన్ని అందించే మాధ్యమమే కాకుండా,పాలకులను ప్రశ్నించే శక్తిగా,ప్రజల హక్కులను కాపాడే బాధ్యతాయుతమైన...