హాజీపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు.రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లో గల హాజీపూర్ పోలీస్ స్టేషన్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు.ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను, వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను కమిషనర్ పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోని ఫిర్యాదుల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ ఉన్న బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను స్వీకరించిన వెంటనే చట్టపరిధిలో విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐ కిరణ్ కుమార్‌ను ఆదేశించారు. ఫిర్యాదుల స్వీకరణ కేంద్రంలోని రికార్డులను...