సీఎం సభకు సిద్దిపేటలో ఏర్పాట్లు షురూ.. సభా ప్రాంగణాన్ని పరిశీలించిన -దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 16,(తెలంగాణ కెరటం)ఈ నెల 19న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభకు సంబంధించి సిద్దిపేటలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.ఈ నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఐజీ కార్తికేయ, సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ రేష్మి పెరుమాళ్ సిద్దిపేట సమీపంలోని సభా ప్రాంగణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున సభా ప్రాంగణం అనుకూలత, వేదిక ఏర్పాటు, పార్కింగ్ సౌకర్యాలు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లపై అధికారులు సమగ్రంగా పరిశీలించారు.ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ...