దుబ్బాక నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలి.. -బీడీ కార్మికులు, వృద్ధులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలి.. ఎన్నికల హామీ మేరకు పింఛన్లు పెంచాలి. -పెండింగ్ సాగునీటి కాలువలు, రోడ్లు, మున్సిపల్ నిధులు వెంటనే విడుదల చేయాలి. -జిల్లా
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 16,(తెలంగాణ కెరటం)దుబ్బాక నియోజకవర్గంలో ప్రజలు, రైతులు, బీడీ కార్మికులు, వృద్ధులు, పేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడంతో పాటు, అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామికి విజ్ఞప్తి చేశారు.సిద్దిపేట జిల్లా అక్బర్పేట–భూంపల్లి మండలం నగరం గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీరామలింగేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, కొత్త పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి...