దుర్వినియోగమైన మున్సిపల్ ప్రజాధనాన్ని రికవరీ చేయాలి
కలెక్టర్ కు కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 16 : కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావులు తమ వ్యక్తిగత ఇంటి పనుల కోసం మున్సిపల్ ఉద్యోగులను వినియోగించుకోని, సుమారు రూ.02.46 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ మెట్ పల్లి కాంగ్రెస్ నాయకులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దుర్వినియోగమైన ప్రజాధనాన్ని రికవరీ చేయాలని కలెక్టర్ ను కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ..గత కొన్ని సంవత్సరాలుగా సుమారు 10 మంది మున్సిపల్ ఉద్యోగులను వారి వ్యక్తిగత ఇంటి పనుల కోసం నియమించుకున్నారని, కాంగ్రెస్ పార్టీ పోరాటం వలన...