మెట్పల్లి పట్టణ సమస్యలు పరిష్కరించాలని బిజెపి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష

అధికార యంత్రాంగం స్పందించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం    మెట్పల్లి బిజెపి పట్టణ అధ్యక్షుడు ధోనికెల నవీన్ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 16 : మెట్పల్లి పట్టణంలో నెలకొన్న స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ మెట్ పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పట్టణ అధ్యక్షులు దోనికెల నవీన్ నిరాహార దీక్ష చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు, బిజెపి జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాసన్, రాష్ట్ర డాక్టర్ సెల్ కన్వీనర్ డాక్టర్ గంగసాగర్ తదితర బీజేపీ...