మెట్పల్లి ఉర్దూ పాఠశాల, షాదీఖానా అభివృద్ధిపై దృష్టి సారించాలి
జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఖుతుబోదీన్ పాషా ప్రజావాణిలో వినతి పత్రం అందజేత తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 16 : మెట్పల్లి పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాల భవన నిర్మాణం, మైనారిటీ షాదీఖానా అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖుతుబోదీన్ పాషా సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి కేవై.ప్రసాద్ ను కలిసి, వినతి పత్రం అందజేశారు. అనంతరం పాషా మీడియాతో మాట్లాడుతూ.. మెట్పల్లి పట్టణంలోని ప్రైమరీ ఉర్దూ మీడియం స్కూల్ భవనం సంవత్సరాలు గడుస్తున్నా, అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు....