సంత్ సేవాలాల్ దేవాలయ భూమి పూజ మహోత్సవం
హాజరైన మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 16 : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్‌లో శ్రీశ్రీశ్రీ జగదాంబ మాత సంత్ సేవాలాల్ మహారాజ్ దేవాలయ నిర్మాణానికి సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. జగిత్యాల జిల్లా బంజారా సంఘం ఆధ్వర్యంలో గీతా విద్యాలయం పక్కన నిర్వహించిన ఈ భూమి పూజ మహోత్సవానికి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నందయ్యలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని బంజారా సంఘం జిల్లా అధ్యక్షులు భుక్య నందు నాయక్ ఆధ్వర్యంలో...