పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు

చేయూత పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి- మేడ్చల్ నియోజకవర్గంలో 6 వేల మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు.. ఘట్‌కేసర్ సర్కిల్‌లో 900 మందికి పైగా మంజూరు(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 16: పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడంతో పాటు, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య...