తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా గడ్డం ఇందుప్రియ

తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా గడ్డం ఇందుప్రియ నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనకు కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇందుప్రియ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి జనరల్ సెక్రటరీ పదవి అప్పగించిన నాయకత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని...