దుబ్బాక నియోజకవర్గ రోడ్ల అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులు మంజూరు చేయండి -మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 17, తెలంగాణ కెరటం:దుబ్బాక నియోజకవర్గంలోని ఆర్‌అండ్‌బీ రహదారులు అధ్వానంగా మారి ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోడ్ల మరమ్మతులు, నూతన రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కోరారు.ఈ మేరకు మంగళవారం మంత్రిని కలిసి నియోజకవర్గంలోని రహదారుల సమస్యలను వివరిస్తూ లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేశారు. తొగుట, భూంపల్లి, దుబ్బాక మండలాల్లో హై లెవల్ బ్రిడ్జిల (HLB) నిర్మాణంతో పాటు మొండి చింత–బేగంపేట రోడ్డు, భూంపల్లి–దొమ్మాట రోడ్డు, హబ్సిపూర్–దుబ్బాక రోడ్డు, దుబ్బాక–మెదక్–సిద్దిపేట రహదారి, మెట్టు–దౌల్తాబాద్ రోడ్డు తదితర మార్గాల పునరుద్ధరణ,...