దుబ్బాక, సిద్దిపేట అభివృద్ధికి రూ.350 కోట్లు కేటాయించాలి-మల్లన్న సాగర్ భూ బాధితులను సీఎం రేవంత్ రెడ్డి ఆదుకోవాలి-చేనేత, పద్మశాలి కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ పథకం ఏర్పాటు చేయాలి-సీఎం రేవంత్ రెడ్డికి బీఎల్ఎఫ్ చైర్మన్ శ్రీరాం రామకృష్ణ ప్రభు లేఖ

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 17, అఖండ దీపం:తెలంగాణ రాష్ట్రంలోనే దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని, రాజకీయ నాయకులు స్వార్థపూరిత రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని బహుజన లిబరల్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) చైర్మన్ శ్రీరాం రామకృష్ణ ప్రభు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన సందర్భంగా సిద్దిపేటతో పాటు దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి రూ.350 కోట్లు కేటాయించాలని కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.దుబ్బాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఎస్పీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మాచవరం వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు.. దుబ్బాక చేనేత కళలు అద్భుతమైన నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని, ఈ ప్రాంతంలోని...