దుబ్బాక అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలి – సీఎం రేవంత్ రెడ్డికి వినతి -దుబ్బాకకు రెవెన్యూ డివిజన్ మంజూరు చేయాలి -డీడీఎఫ్ అధ్యక్షుడు మాడబోయిన శ్రీకాంత్

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 17, అఖండ దీపం:సిద్దిపేట జిల్లాలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గంగా ఉన్న దుబ్బాకకు రెవెన్యూ డివిజన్ మంజూరు చేయడంతో పాటు, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని దుబ్బాక డెవలప్‌మెంట్ ఫోరం అధ్యక్షుడు మాడబోయిన శ్రీకాంత్ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య, వైద్యం, రహదారులు వంటి కీలక రంగాల్లో దుబ్బాక నియోజకవర్గం ఎంతో వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు లేకపోవడంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని తెలిపారు. ఫలితంగా యువత నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.నియోజకవర్గ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు...