ఈ నెల 19న సీఎం సభను విజయవంతం చేయాలి -సిద్దిపేట గడ్డపై బీఆర్ఎస్ పదేళ్ల పాలన వైఫల్యాలను ప్రజల ముందుంచుతాం
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 17, తెలంగాణ కెరటం:ఈ నెల 19న సిద్దిపేటలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పిలుపునిచ్చారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, శాసనమండలి సభ్యులు కేతావత్ శంకర్ నాయక్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, దుబ్బాక నియోజకవర్గ...