మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో స్వయం ఉపాధికి ప్రోత్సాహం

 మహిళా సంఘాలకు రూ.20 లక్షల వరకు రుణ సదుపాయం మంగపేట మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో 659 మందికి నూతన చేయూత పింఛన్లు 467 మహిళా సంఘాలకు రూ.35.25 కోట్ల రుణాల చెక్కుల పంపిణీ పంచాయతీరాజ్,స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ములుగు జిల్లా బ్యూరో, (తెలంగాణ కెరటం) నవంబర్ 17:మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రతి ఒక్కరూ స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వం పొందాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు.ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం మైదానంలో 15 గ్రామ పంచాయతీలకు, రాజుపేట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో...