యువతే కాంగ్రెస్ పార్టీకి బలం.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం!

 యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డిని కలిసిన పోచారం, ఎదులబాద్ డివిజన్ నూతన అధ్యక్షులు(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 17: రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరిగినప్పుడే సమాజంలో నూతన మార్పులకు పునాది పడుతుందని, యువతను రాజకీయ చైతన్యం వైపు నడిపించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని యువజన కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డిని మేడ్చల్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర రాహుల్ ఆధ్వర్యంలో పోచారం డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపాగుల వినోద్ కుమార్, ఎదులబాద్ డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చిలుకూరి నిఖిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల...