కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే ప్రకటించాలి.

టీఎస్ సిపిఈ యు రాష్ట్ర కార్యదర్శి గోపాల్.తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 17):టీఎస్ పిఎస్ఈ యు ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెండు లక్షల అరవై వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులందరూ సామూహిక సెలవు కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యోగులకు మేలు చేకూర్చే పాత పెన్షన్ విధానాన్ని వెంటనే ప్రకటించాలని తెలియజేస్తూ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట తాసిల్దార్ సైదులుకి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి గోపాల్, మాట్లాడుతూ పదవి విరమణ పొందిన ఉద్యోగులందరూ కనీసం ఆసరా పెన్షన్ కన్నా హీనమైన పెన్షన్ తీసుకుంటూ తమ కుటుంబ పోషణ భారంగా...