రోడామేస్త్రీ నగర్ డివిజన్ లో బీజేపీ జిల్లా అధ్యక్షులు గిరి వర్దన్ రెడ్డి పర్యటన. నూతనంగా ఎన్నుకోబడిన నాయకులకు పత్రాలు అందజేస్తున్న గిరి వర్ధన్ రెడ్డి.
రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం) కుత్బుల్లాపూర్ నియోజక వర్గం రోడామేస్త్రీ నగర్ కుత్బుల్లాపూర్ అసెంబ్లీ పరిధిలోని రోడామేస్త్రీ నగర్ డివిజన్ లో బీజేపీమేడ్చల్-మల్కాజిగిరి అర్బన్ జిల్లా అధ్యక్షులు గిరి వర్ధన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ముందుగా బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇటీవల ప్రమాదానికి గురైన పార్టీ కార్యకర్తను పరామర్శించి, ధైర్యం చెప్పి, పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ మనోహర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ముఖ్య అతిథులుగా గౌరవ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, జిల్లా అధ్యక్షులు గిరి వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరి వర్ధన్...