ప్రజల అవసరాలకు అనుగుణంగా సంక్షేమం

 కెరటం తాండూర్,ప్రతినిధి: అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.బషీరాబాద్ మండల కేంద్రంలో మండలానికి చెందిన దాదాపు 1,031 మంది లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ దీపక్ తివారితో కలిసి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...పెన్షన్ పథకంలో అవినీతికి తావులేదు.. ఎవరైనా (రాజకీయ నాయకులైన, అధికారులైన) పెన్షన్ ఇప్పిస్తామని డబ్బులు అడిగితే సహించేది లేదు.అర్హతే ప్రామాణికంగా, ఎలాంటి అవినీతి, రాజకీయ ఒత్తిళ్లు లేకుండా పారదర్శకంగా పెన్షన్లు మంజూరు చేశాం.పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పేద ప్రజల నిరీక్షణకు ప్రజా ప్రభుత్వం తెరదించింది....