మూడు గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లకు శ్రీకారం

మూడు గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లకు శ్రీకారం రైతులు మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలి సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి నర్సారెడ్డి తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 17 : రైతులకు మద్దతు ధర అందించడమే లక్ష్యంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏకిన్‌పూర్ పరిధిలోని ఏకిన్‌పూర్, నాగులపేట, సంగెం గ్రామాల్లో మంగళవారం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సంఘ అధ్యక్షులు సింగిరెడ్డి నర్సారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి, మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు చీటి స్వరూప వెంకట్రావు, కేతిరెడ్డి...